మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు నిర్మించనున్న రిటైనింగ్ వాల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ.294.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు కృష్ణా నది కుడివైపున ఈ వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. వరదల సమయంలో తాడేపల్లి పరిసర ప్రాంతాలు నీట మునిగే పరిస్థితులు ఏర్పడకుండా ఈ రిటైనింగ్ వాల్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తాడేపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు వరదల నుంచి శాశ్వత రక్షణ లభిస్తుందని అన్నారు. ప్రాంతీయ అభివృద్ధి, ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















