జబర్దస్త్ ఫేమ్ కొమురక్క ఇంట్లో జరిగిన ఒక పాత బంగారం దొంగతనం చివరకు ఆమెపై హత్యాప్రయత్నం దాకా వెళ్ళింది. కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే శ్రీనాథ్ గతంలో ఆమె ఇంట్లోనే బంగారం చోరీ చేశాడు. ఈ విషయం బయటపడటంతో, తానే దొంగతనం చేశానని ఒప్పుకున్న శ్రీనాథ్.. ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికాడు. అయితే రోజులు గడుస్తున్నా అతడు స్పందించకపోవడంతో, రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని తీవ్రంగా మందలించారు. తనని అందరి ముందు తిట్టారన్న కక్షతో శ్రీనాథ్ తన స్నేహితులకు ఈ విషయాన్ని చేరవేసి, కొమురక్కపై దాడికి పక్కా స్కెచ్ వేశాడు.
అర్ధరాత్రి ఫొటోల పేరిట ఎంట్రీ: మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఎనిమిది మంది యువకులు (వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్) ఉడిత్యాలలోని కొమురక్క నివాసానికి చేరుకున్నారు. తాము ఆమెకు వీరాభిమానులమని, ఒక ఫొటో దిగి వెళ్తామని నమ్మబలికి గేట్లు తెరిపించుకుని లోపలికి ప్రవేశించారు.
రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి: లోపలికి వెళ్ళిన వెంటనే తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావంటూ గొడవకు దిగారు. వంశీకృష్ణ అనే నిందితుడు రాయి తీసుకుని కొమురక్కపై దాడికి ప్రయత్నించగా, ఆమె సోదరుడు యాదయ్య అడ్డుపడ్డారు. దాంతో నిందితులు యాదయ్య తలపై రాయితో బలంగా కొట్టారు. మరో నిందితుడు చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డువచ్చిన స్థానికులను కూడా రాళ్లతో కొట్టి, “ఎప్పటికైనా నిన్ను చంపేస్తాం” అంటూ కొమురక్కను బెదిరించారు.
పోలీసుల వేట – నిందితుల అరెస్ట్: ఘటన జరిగిన వెంటనే స్థానికులు గుమిగూడటంతో నిందితులు భయపడి తమ ద్విచక్ర వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. బుధవారం ఉదయం బాధితుల ఫిర్యాదు అందుకున్న బాలానగర్ పోలీసులు వేగంగా స్పందించారు. ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కొమురక్క మరియు ఆమె సోదరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















