ICC Men’s T20 World Cup లో పాకిస్థాన్‌కు అనూహ్యంగా కఠినమైన పోరాటం ఎదురైంది. పసికూనగా భావించే నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ జట్టు చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేవలం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.148 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గెలుపు పరుగులు సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.
మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ జట్టు పాకిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. పాకిస్థాన్ ఒక దశలో 100 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో ఫహీమ్ అష్రఫ్ అద్భుతంగా స్పందించాడు. కేవలం 11 బంతుల్లోనే 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించి పాకిస్థాన్‌ను ఓటమి నుంచి బయటకు తీసుకొచ్చాడు.
పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆయుబ్ 24 పరుగులు చేసి కొంత మద్దతిచ్చాడు. అయితే మిగతా బ్యాటర్లు నెదర్లాండ్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయారు.నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ తలో రెండు వికెట్లు తీయగా, లోగాన్ వాన్ బీక్, కైల్ క్లైన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో వికెట్ సాధించారు. మ్యాచ్ అంతా క్రమశిక్షణతో బంతులేసిన నెదర్లాండ్స్ బౌలర్లు చివరి ఓవర్లలో అనుభవలేమితో పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్లో లోగాన్ వాన్ బీక్ 24 పరుగులు ఇవ్వడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
లేకపోతే, పాకిస్థాన్‌పై నెదర్లాండ్స్ ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించే స్థాయిలో నిలిచింది.
అంతకుముందు నెదర్లాండ్స్ బ్యాటింగ్‌లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాస్ డీ లీడే 30, మైఖేల్ లెవిట్ 24, కోలిన్ అకెర్మాన్ 20 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పాక్ బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ తలో రెండు వికెట్లు తీశారు. షాహీన్ అఫ్రిది ఒక వికెట్ సాధించాడు.ఈ గెలుపుతో పాకిస్థాన్ ఖాతాలో కీలక పాయింట్లు చేరినప్పటికీ, నెదర్లాండ్స్ ప్రదర్శన మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















