ముందుగా మ్యాట్‌పై కాళ్లు, చేతులను నేలకు ఆనించి శరీరాన్ని టేబుల్‌లా ఉంచాలి. అనంతరం చేతులను ముందుకు జరిపి నేలపై గట్టిగా ఆన్చాలి. నెమ్మదిగా మోకాళ్లను ముందుకు తీసుకువస్తూ కాళ్లను సాధ్యమైనంతవరకు నిటారుగా ఉంచాలి. మడమలను నేలకు ఆనించే ప్రయత్నం చేయాలి. మెడ, తలను బిగుతుగా ఉంచకుండా తలను నేలవైపు వంచి 15-30 సెకన్లపాటు ఉండాలి. సాధన పెరిగేకొద్దీ క్రమంగా మరింత లోతుగా చేయవచ్చు.
ఉపయోగాలు: ఈ సాధన భుజాలు, చేతులు, మణికట్టు కండరాలకు బలం చేకూర్చడంతో పాటు శరీర సౌలభ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడటానికి, ఒత్తిడి తగ్గడానికి తోడ్పడొచ్చు. మైగ్రేన్ లక్షణాల సమయంలో కొంత ఉపశమనం కలిగించవచ్చు.
మహాశీర్ష ముద్ర: సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చొని రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి. ఉంగరం వేలును అరచేతిలోకి మడిచి, బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలు చివర్లను కలపాలి. చిటికెన వేలును నిటారుగా ఉంచాలి. కళ్లను మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టాలి. రెండు చేతులతోనూ ఈ ముద్రను 10-15 నిమిషాలపాటు సాధన చేసి అనంతరం విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో సహాయపడొచ్చు.
ఆహారంలోనూ జాగ్రత్తలు అవసరం: రోజంతా తగినంత నీరు తాగాలి. కాఫీ, టీ, శీతల పానీయాలను తగ్గించడం లేదా నివారించడం మంచిది. నిల్వ పచ్చళ్లు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
జాగ్రత్త: మెడ, భుజాలు లేదా మణికట్టు సమస్యలు ఉన్నవారు ఈ సాధనలను నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి. మైగ్రేన్ తరచుగా వస్తుంటే లేదా తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















