హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో సోమవారం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు జరిగినట్లు సమాచారం. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
దీనికి కొనసాగింపుగా బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
వర్షిత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఘటనపై వివరాలు తెలుసుకోవాలని రామచందర్‌రావు నిర్ణయించుకున్నారు. అయితే నల్గొండకు వెళ్లేందుకు ప్రయత్నించకుండా పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలోనే గృహనిర్బంధం చేశారు. తాజా పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్గొండలో పరిస్థితులపై పోలీసులు నిఘా పెంచారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















