దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఉదయం నుంచే భానుడి ప్రభావం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండల కారణంగా వడదెబ్బ, తలనొప్పి, చర్మ సమస్యలు, గుండె వేగంగా కొట్టుకోవడం, తల తిరగడం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల వడదెబ్బతో ప్రాణనష్టాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.
ఇలాంటి సమయంలో ఎర్ర ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ‘మాలెక్యులస్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం ఎర్ర ఉల్లిపాయల్లో ప్రోటీన్లు, ఫెనోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంపై వేడి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఎండ వేడిని తట్టుకునే శక్తిని కూడా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరం నీరు, ఖనిజ లవణాలను కోల్పోతుంది. ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన నీరు, మినరల్స్ అందుతాయి. దీంతో శరీరం చల్లగా ఉండటంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
ఎర్ర ఉల్లిపాయల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాటిని పచ్చిగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెరుగన్నంతో పాటు ఉల్లిపాయలు తినడం శరీరాన్ని చల్లబరుస్తుందని చెబుతున్నారు. అయితే పాంక్రియాస్ సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలను పరిమితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా మేరకు ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















