వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 కుటుంబాలకు సంబంధించిన రూ.200 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు.
ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని చంద్రబాబు అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు పునరావాస ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.
వెలిగొండ నిర్వాసితులకు ఇప్పటివరకు రూ.518 కోట్ల పరిహారం చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. ఇంకా పరిహారం అందాల్సిన వారికి కూడా త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తించాలని చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు, ఇతర ప్రయోజనాలు కలిగినా.. అందుకోసం భూములు కోల్పోయిన కుటుంబాల సంక్షేమాన్ని విస్మరించకూడదని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
కార్యక్రమంలో జలవనరులశాఖ మంత్రి రామానాయుడు, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పునరావాస కమిషనర్ ప్రశాంతి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















