వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎండ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఎక్కువసేపు బయట గడపడం వల్ల డీహైడ్రేషన్ సమస్యకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట ఎక్కువగా కారడం సహజం. అయితే దీని ద్వారా శరీరంలోని నీరు, అవసరమైన లవణాలు తగ్గిపోతే డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు నీరసంగా కనిపించడం, నోరు ఎండిపోవడం, తరచుగా మూత్రవిసర్జన తగ్గిపోవడం, వాంతులు చేయడం, చిరాకు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఈ సమయంలో పిల్లలకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
వేసవిలో పిల్లలకు ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు ఇవ్వడం కంటే తక్కువ మొత్తంలో తరచుగా ఇవ్వడం ఉత్తమం. పిల్లలు నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే, ఫ్లేవర్డ్ వాటర్, పండ్ల ముక్కలు కలిపిన నీరు, కీరా, తర్బూజ, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలు ఇవ్వడం మంచిది. అలాగే చిన్నారుల వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేత రంగుల, నూలు బట్టలు వేసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. వదులుగా ఉండే దుస్తులు ధరించడం ద్వారా చెమట త్వరగా ఆవిరై, ఎండ ప్రభావం తగ్గుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















