నరాలు-కండరాల సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు కాళ్లు, కటి భాగాన్ని దృఢంగా ఉంచేందుకు అనంతాసనం ఉపయోగపడుతుంది. శరీర సమతుల్యతను పెంచడంలోనూ ఈ ఆసనం తోడ్పడుతుంది.
చేసే విధానం: ముందుగా యోగా మ్యాట్‌పై ఎడమవైపు తిరిగి పడుకోవాలి. ఎడమ చేతిని మోచేతి దగ్గర వంచి, తలను ఎడమ అరచేతిపై ఉంచాలి. ఎడమ కాలిని నేలపై నిటారుగా ఉంచి.. కుడి కాలిని వీలైనంత పైకి ఎత్తాలి. కనీసం 90 డిగ్రీల కోణంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. కుడి చేత్తో కుడి పాదం బొటనవేలును పట్టుకుని కాలును నిటారుగా ఉంచాలి.
ఈ సమయంలో కింద ఉన్న కాలును, నడుమును వెనక్కి వంచకుండా స్థిరంగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ 15-20 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండేందుకు ప్రయత్నించాలి. అనంతరం నెమ్మదిగా కాలును దించి శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత మరోవైపు తిరిగి ఇదే విధానాన్ని పునరావృతం చేయాలి.
ఉపయోగాలు: తుంటి కండరాలకు బలం చేకూర్చడంతో పాటు శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో అనంతాసనం సహాయపడుతుంది.
జాగ్రత్తలు: తుంటికి గాయం అయినవారు లేదా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడేవారు వైద్యుల సలహాతోనే ఈ ఆసనాన్ని సాధన చేయాలి.
ఆహారం: కాళ్లు, తుంటి కండరాల బలానికి కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలకూర, నువ్వులు, గుడ్లు, సోయాబీన్, పన్నీరు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















