ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వ హయాంలో సరైన నీటి సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అడుగు నీరు కూడా అందక పంటలు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీరు అందుతోందని, దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు.
రాయలసీమకు సాగునీరు అందించడం సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి ఫలితమేనని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. చంద్రబాబు లేకుంటే ఈ స్థాయిలో నీటి సౌకర్యం సాధ్యమయ్యేది కాదని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.అలాగే సీఎం చంద్రబాబు గురించి వైకాపా నాయకులు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె విమర్శించారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధానాలే అసలైన రాజకీయానికి కొలమానం అని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని భూమా అఖిలప్రియ తెలిపారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Entertainment Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















