విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,100 మంది పోలీసులు, సిబ్బంది ఆయా గ్రామాల్లో బస చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితి, స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజలకు చట్టాలు, నేరాల నివారణ, సైబర్ మోసాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
గరివిడి మండలం కాపుశంభాం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ పాల్గొన్నారు. గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గ్రామాల్లో చిన్నపాటి వివాదాలు తలెత్తినప్పుడు వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
అదేవిధంగా యువత చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను గౌరవిస్తూ మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలని, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















