Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
మంత్రులు Savitha, Gottipati Ravi Kumarతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ.. జమ్మలమడుగు ప్రాంతం వైపు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం చూస్తోందన్నారు. ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.
‘‘ఉపాధి కల్పన మా బ్రాండు.. గొడ్డలి జగన్ బ్రాండు’’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పాలకులు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు నమ్మకం కల్పిస్తూ పరిశ్రమలను తీసుకొస్తోందన్నారు.Royal Enfieldతో పాటు ఫైటర్ జెట్ కంపెనీలు కూడా తిరుపతికి రానున్నాయని వెల్లడించారు. విశాఖ, అమరావతి, తిరుపతిని ఎకనమిక్ రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చామని, నిర్మాణం చేయడం ఎంతో కష్టమని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















